ఈ సూప్స్ తాగితే.. వానాకాలంలో మంచి హుషారు వస్తుంది

ఈ సూప్స్ తాగితే.. వానాకాలంలో మంచి హుషారు వస్తుంది

ఈ వర్షాకాలంలో బయట జల్లులు పడుతుంటే నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించడం సాధారణంగా జరిగే ప్రక్రియే. అలా అని ఏవి పడితే అవి తింటే అనారోగ్యాలను తెచ్చిపెట్టుకున్నటేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో మనసుకు ప్రశాంతతకు, రిఫ్రెష్మెంట్ ను ఇచ్చేందుకు కొన్ని సూప్ తీసుకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు.

టమాటా బాసిల్ సూప్

టమాటా బాసిల్ సూప్ అనేది పండిన టమాటాలు, తులసిని కలిపి తయారు చేస్తారు. రిలాక్సేషన్ కు అమితంగా ఇష్టపడే ఈ సూప్ ఎంతో సువాసనను కలిగి ఉంటుంది.

లెంటిల్ సూప్

లెంటిల్ సూప్ అని పిలవబడే ఈ సూప్ ను కూరగాయలు, ఇతర సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తాకు. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

టాంగీ సూప్

నిమ్మకాయ, కొత్తిమీర కలయికతో తయారయ్యే ఈ సూప్ ను టాంగీ సూప్ అంటారు. దీన్నే రిఫ్రెషింగ్ సూప్ అని కూడా అంటారు. సువాసనతో కూడి ఉండే ఈ సూప్.. ఈ వర్షాకాలంలో మరింత తాజాగా ఉండడానికి సహాయపడుతుంది.

క్రీమీ మష్రూమ్ సూప్

క్రీమీ మష్రూమ్ సూప్ అనేది పుట్టగొడుగులతో తయారవుతుంది. ఇందులో వేసే వెల్లుల్లి అత్యంత రుచినిస్తుంది. ఇది ఈ వానాకాలంలో మంచి అనుభూతిని కలిగిస్తుంది.

స్వీట్ కార్న్ సూప్

స్వీట్ కార్న్ సూప్ ను మొక్కజొన్న, బంగాళదుంపలను కలిపి స్మోకీ ఫ్లేవర్ తో తయారు చేస్తారు. ఇది వర్షాకాలంలో సాయంకాల సమయాల్లో తీసుకోవడం మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

పాలకూర, కొబ్బరి నూనె సూప్

పాలకూర, కొబ్బరి నూనె సూప్.. పాలకూర, కొబ్బరి పాలతో తయారవుతుంది. దీన్ని సుగంధ ద్రవ్యాలతో జోడించి తీసుకుంటే పోషకాలతో పాటు మంచి రిఫ్రెషింగ్ ఫీల్ కలుగుతుంది.

క్యారెట్ సూప్

దీన్ని లేత క్యారెట్ లతో తయారు చేస్తారు. క్యారెట్ లను బాగా ఉడికించి సూప్ గా తయారు చేస్తారు. ఇది తీపి, కొంచెం చప్పని రుచిని కలిగి ఉంటుంది. ఇందులో సుగంధ ద్రవ్యాలను కలిపినా మంచి టేస్టీగా ఉంటుంది.