విమానాలను పేల్చేస్తామని.. బాంబు బెదరింపులకు పాల్పడిన దుండుగుల భరతం పట్టేందుకు పోలీసులు ఆపరేషన్ ముమ్మరం చేశారు. గత మూడు రోజులుగా డెభ్బైసార్లు బాంబుల పెట్టి పేల్చే స్తామని గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు మెసేజ్ లు పెడుతూ చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమైంది. నిందితులను గుర్తించేందుకు రంగంలోకి దిగింది.. ఇందు కోసం బాంబు బెదిరింపు మెసేజ్ పంపించిన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై దృష్టి సారించింది. దుండగుల ఆటకట్టించేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం X సహాయం కోరారు పోలీసులు.
180 మందితో బెంగళూరు వెళ్తున్న అకాసా ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు మెసేజ్ లు పంపించారు దుండగులు. ఈక్రమంలో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్టోబర్ నెలలో ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపులతో సహా పలు కేసులపై దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఈ బాంబు బెదిరింపు కేసులను దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు, సైబర్ సెల్, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
బాంబు బెదిరింపు మేసేజ్ లను పంపించేందుకు నిందితులు వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ (VPN) లేదా డార్క్ వెబ్ బ్రౌజర్ ను వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటువంటి మేసేజ్ లను నిలిపివేయాలని, పోస్టులను తొలగించాలని X ప్లాట్ ఫాం ను పోలీసులు కోరారు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలనుంచి బెదిరింపు మెసేజ్ లు పంపించారు. ఐపీ అడ్రస్ లను కనుగొ నేం దుకు సోషల్ మడియా X ను కోరామని పోలీసు అధికారులు చెబుతున్నారు.