హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు

హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు
  • హనుమాన్ శోభాయాత్రకు 7వేల మంది పోలీసులతో బందోబస్తు

హైదరాబాద్: హనుమాన్ శోభాయాత్రకు 7 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు సిటీ పోలీసులు. రెండేళ్లుగా కరోనా వల్ల శోభాయాత్ర జరగని విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా మునుపటి పరిస్థితులు నెలకొనడంతో ఈసారి శోభాయాత్రలో భారీగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేయడమే కాదు.. భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు, డ్రోన్స్ ఉపయోగించనున్నారు. 

గౌలిగూడలోని రామ మందిర్ నుండి ప్రధాన శోభాయాత్ర ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్ తాడ్ బండ్ లో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద శోభాయాత్ర ముగుస్తుంది. మొత్తం 12 కిలోమీటర్లు సాగనున్న శోభాయాత్రలో దారిపొడవునా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు ఏర్పాట్లు చేవారు. అలాగే కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుండి మరో శోభాయాత్ర ప్రారంభమై కోఠిలోని ఆంధ్రా బ్యాంక్ వద్ద ప్రధాన శోభాయాత్రలో కలవనుంది. 
రేపు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
శోభాయాత్ర జరగనున్న మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నారు. గణేష్ నిమజ్జన ఊరేగింపుకు దీటుగా జరిగే అవకాశం ఉండడంతో దారి పొడవునా ట్రాఫిక్ కు ఇబ్బందిలేకుండా.. యాత్రలో పాల్గొనే వారికి ఆటంకాలు ఎదురుకాకుండా పోలీసులను మొహరించనున్నారు. 

 

ఇవి కూడా చదవండి

ఈశ్వరప్పను అరెస్ట్ చేయాల్సిందే

ధనుష్ క్లాప్తో ఆశిష్ కొత్త మూవీ

మనిషి మరణించినా బతికుండేది ఎప్పుడంటే..

విశ్లేషణ: రాష్ట్రం వచ్చి ఏడేళ్లయినా మార్పు లేదు

స్కిన్ టైట్ డ్రెస్లు వేసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త