ఈశ్వరప్పను అరెస్ట్ చేయాల్సిందే

ఈశ్వరప్పను అరెస్ట్ చేయాల్సిందే

కర్నాటక మంత్రి ఈశ్వరప్ప రాజీనామా పరిష్కారం కాదన్నారు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్. కాగా.. పదవికి రాజీనామా చేస్తున్నట్లు నిన్న మంత్రి ఈశ్వరప్ప ప్రకటించారు. రాజీనామా ప్రకటన చేసినా.. కాంగ్రెస్ నేతలు మాత్రం ఆందోళనలు విరమించలేదు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ అనుమానాస్పద మృతి కేసులో ఈశ్వరప్పపై కేసు నమోదు చేసి.. ఆయన్ని అరెస్టు చేయాలన్నారు. కమీషన్ అడిగినట్లు FIRలో ఎక్కడుందని ప్రశ్నించారు డీకే శివకుమార్. ఈశ్వరప్పపై కేసు నమోదు డిమాండ్.. కాంగ్రెస్ ది కాదు...కర్ణాటక ప్రజల డిమాండ్ అన్నారు. ఈశ్వరప్ప, అతని స్నేహితులు రమేశ్, బసవరాజ్ ను అరెస్టు చేయాలని శివకుమార్ డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం

బూట్స్​ను కొననున్న రిలయన్స్‌!

రోహిత్ ఫామ్ పై దిగులు లేదు