రోహిత్ ఫామ్ పై దిగులు లేదు 

రోహిత్ ఫామ్ పై దిగులు లేదు 

పుణె: ఐపీఎల్–2022లో రోహిత్ శర్మ ఫామ్ గురించి దిగులు చెందట్లేదని ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్ధనే తెలిపాడు. అతడో అత్యుత్తమ ప్లేయర్ అని కొనియాడాడు. ‘ఇంతకుముందు రోహిత్‌‌‌‌ 14, 15 ఓవర్లు ఆడి భారీ స్కోర్లు సాధించడం చూశాం. అతడు ప్రతిభగల ప్లేయర్, అత్యుత్తమ ఆటగాడు. రోహిత్ ఫామ్‌‌ గురించి నేను పెద్దగా ఆందోళన చెందడం లేదు’ అని జయవర్ధనే చెప్పాడు. ఇక పంజాబ్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ను ఐదో స్థానంలో బ్యాటింగ్ కు పంపడంపైనా కోచ్‌‌ స్పందించాడు. ఈ మ్యాచ్ లో ఆరుగురు బ్యాటర్లతో బరిలో దిగాం. సూర్య కంటే మంచి ఫినిషర్‌‌ లేడని భావించి ఆ నిర్ణయం తీసుకున్నాం. పవర్‌‌ప్లేలోనే రెండు వికెట్లు పడేసరికి అలాంటి పరిస్థితుల్లో సూర్యను పంపిస్తే అపోనెంట్ బౌలర్ల స్వింగ్ వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉందని అనుకున్నాం. అందుకే అతడిని ముందుగా పంపించలేదు. అదొక వ్యూహం మాత్రమే’ అని జయవర్ధనే వ్యాఖ్యానించాడు.