ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సింధు దూరం.. లక్ష్యసేన్‌‌‌‌, సాత్విక్‌ జోడీపై అంచనాలు

ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సింధు దూరం.. లక్ష్యసేన్‌‌‌‌, సాత్విక్‌  జోడీపై అంచనాలు

బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు ప్రతిష్టాత్మక ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పుకుంది.  దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిక్కుకుపోయిన  కారణంగా తను ఈ టోర్నీ కోసం బర్మింగ్‌‌‌‌హామ్ వెళ్లలేకపోయింది.  దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మూసివేయడంతో సింధు, ఆమె కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇర్వాన్శ్స ఆది ప్రతామ శనివారం నుంచి అక్కడే ఉండిపోయారు. 

దాంతో మంగళవారం నుంచి జరిగే  ఈ టోర్నీలో  సింధు బరిలోకి దిగడం లేదని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మిగతా షట్లర్లు సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆఫ్రికా మీదుగా ప్రయాణించి బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షట్లర్లు లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆయుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెట్టి ఎలాంటి ప్రయాణ సమస్యలు లేకుండా ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరారు.

 మెగా టోర్నీలో లక్ష్యసేన్, డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టిపై ఇండియా అంచనాలు పెట్టుకుంది. అయితే లక్ష్య సేన్‌కు తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షి యుకీ (చైనా) రూపంలో కఠిన సవాల్ ఎదురవనుంది. ఆయుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అల్వి ఫర్హాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఇండోనేసియా)తో తలపడనున్నాడు. 

విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాళవిక..  మాజీ  ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంప్ చెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యుఫి (చైనా)తో, ఉన్నతి హుడా.. చొచువాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)తో అమీతుమీ తేల్చుకోనున్నారు. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–చిరాగ్ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కై జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఆరోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (మలేసియా)తో టోర్నీని మొదలుపెట్టనున్నారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రీసా–గాయత్రి, మిక్స్‌‌‌‌డ్‌‌‌‌లో  ధ్రువ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపిల–తనీషా, రోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–రుత్వికా శివాని పోటీలోఉన్నారు.