ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్.. ప్రేగ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్‌లో ఇంకా విజయాల బాట పట్టలేదు. సోమవారం జరిగిన ఐదో రౌండ్‌లో గుకేశ్ 69 ఎత్తుల వద్ద నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. నెల రోజుల కిందట టాటా స్టీల్ చెస్ టోర్నీలో నొడిర్బెక్ చేతిలో పరాజయం చవిచూసిన గుకేశ్.. ఈసారి కాస్త మెరుగ్గానే ఆడినా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయాడు.
నల్లపావులతో ఆడిన గుకేశ్ ఓ దశలో విజయం వైపు దూసుకెళ్తున్నట్లు కనిపించాడు. కానీ చివర్లో చేసిన చిన్న తప్పిదాల వల్ల గేమ్‌పై పట్టు కోల్పోయాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న నొడిర్బెక్ ఈజీగా చెక్ పెట్టాడు. మరో గేమ్‌లో అరవింద్ చిదంబరం.. డేవిడ్ ఆంటన్ గుజారో (స్పెయిన్, 3) చేతిలో 40 ఎత్తుల వద్ద పరాజయం చవిచూశాడు. దివ్య దేశ్‌ముఖ్ (2.5).. సూర్య శేఖర్ గంగూలీ (1)పై గెలిచి టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది.
