మనిషి మరణించినా బతికుండేది ఎప్పుడంటే..

మనిషి మరణించినా బతికుండేది ఎప్పుడంటే..

మనిషి మరణించినా బతికుండేది ఎప్పుడంటే ఇంకొక జీవికి ఆయువు పోసినపుడు. అది ఆర్గాన్ డొనేషన్‌‌తోనే సాధ్యం అవుతుంది. మరొకరికి ప్రాణం పోయాలన్న ఉద్దేశంతో మొదలైనవే ఆర్గాన్‌‌ డొనేషన్ క్యాంప్‌‌లు, అవగాహన కార్యక్రమాలు.  ఆర్గాన్‌‌ డొనేషన్‌‌ గురించి ప్రజల్లో సరైన అవగాహన లేక ఆర్గాన్స్ అవసరముండి  టైంకి అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్లు చాలామంది. అలా ఇక ముందు కాకూడదని ఆర్గాన్‌‌ డోనర్స్​లో 
ఒకడైన 54 ఏండ్ల అనిల్‌‌ శ్రీవత్సస్పెషల్‌‌ ప్రోగ్రామ్స్‌‌ చేస్తున్నాడు.

అనుమానాలు, అపోహలు, విశ్వాసాలు, మూఢ నమ్మకాల వల్ల చనిపోయాక అవయవాలన్నీ తనతోనే మట్టిలో కలిసిపోవాలని, చితిలో కాలిపోవాలని అనుకుంటారు చాలామంది. అవయవ దానం చేయడం ప్రకృతి విరుద్ధం. అలా చేస్తే వచ్చే జన్మలో మామూలుగా పుట్టరనే భావనతో ఉంటారు. కిడ్నీ, లివర్​ వంటివి డొనెట్​ చేస్తే మిగిలిన జీవితాన్ని గడపడం ఇబ్బంది అవుతుందని  ఇంకొందరు అవయవ దానం చేయరు. ఇలాంటి అపోహలన్నీ దూరం చేయాలని ఆస్ట్రేలియా, పెర్త్‌‌లో నిర్వహిస్తున్న ‘వరల్డ్‌‌ ట్రాన్స్‌‌ప్లాంట్‌‌ గేమ్స్’లో పాల్గొనడానికి వెళ్తున్నాడు అనిల్‌‌. పెర్త్‌‌ వరకు అంటే దాదాపు 56,000 కిలోమీటర్లు కారులో ప్రయాణం చేస్తూ... దారిలో అవయవ దానం గురించి అవేర్‌‌‌‌నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాడు.   
ఆర్గాన్‌‌ డోనర్‌‌‌‌గా...
2014లో అనిల్ అన్న డాక్టర్‌‌‌‌ అర్జున్‌‌ శ్రీవత్స కిడ్నీ ఫెయిల్యూర్‌‌‌‌తో బాధపడ్డాడు. కిడ్నీ మార్చితేగానీ బతకలేని పరిస్థితి. ఆర్గాన్‌‌ డొనేట్​​ చేయడానికి ఎవ్వరూ దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడు. చివరికి అనిల్‌‌ కిడ్నీ మ్యాచ్ కావడంతో... తనే డొనేట్‌‌ చేశాడు. అప్పుడు అర్థమైంది ఆర్గాన్ డోనర్స్‌‌ ఎంత అవసరమో. ‘మనలాగ ఇంకా ఎంతమంది టైంకి ఆర్గాన్స్‌‌ దొరక్క ఇబ్బంది పడుతున్నారు’ అని అప్పుడే వాళ్ల ఫ్యామిలీ మొత్తం ఆర్గాన్‌‌ డోనర్స్‌‌గా మారాలని నిర్ణయించుకున్నారు. అలా అప్పటినుండి టైం దొరికినప్పుడల్లా ఆర్గాన్‌‌ డొనేషన్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు ‘గిఫ్ట్‌‌ ఆఫ్‌‌ లైఫ్‌‌ అడ్వెంచర్‌‌’‌‌ అనే ఒక ఎన్జీవోతో కలిసి పని చేస్తున్నాడు. ఈ ఎన్జీవో డోనర్స్‌‌ వివరాలను సేకరిస్తుంది. ఆ సమాచారాన్ని దేశంలో ఎవరికి ఆర్గాన్స్‌‌ కావాలో వాళ్లకు చేరుస్తారు. అంతేకాకుండా ఆర్గాన్ డొనేషన్‌‌ పైన ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటారు.
ఇప్పటికీ 5,000 మందిని ఆర్గాన్ డోనర్స్‌‌గా మార్చాడు. వరల్డ్ గేమ్స్‌‌లో తన అన్నతో కలిసి ఇప్పటికే చాలాసార్లు పాల్గొన్న అనిల్‌‌ ఇప్పుడు గోల్ఫ్‌‌, 100 మీటర్స్‌‌ రన్నింగ్‌‌, స్విమ్మింగ్‌‌, బాల్‌‌ త్రో గేమ్స్‌‌లో పాల్గొంటున్నాడు. ‘ఇకమీదట ఇంకెవరూ ఆర్గాన్స్ కోసం ఎదురుచూడకుండా ఉండాలనేది నా మోటో’ అని చెప్తాడు అనిల్. 
ఇవే కాకుండా సోచ్‌‌ కాస్ట్.కామ్‌‌ అనే పేజ్‌‌కు కో– ఫౌండర్‌‌‌‌గా, సిఇవోగా చేస్తున్నాడు. ఇది ఫీలింగ్స్‌‌ను ఎక్స్‌‌ప్రెస్‌‌ చేసే ఒక ప్లాట్‌‌ ఫామ్‌‌. అలాగే న్యూయార్క్‌‌లో ‘రోటరీ క్లబ్‌‌ ఆఫ్‌‌ ఆర్గాన్‌‌ డొనేషన్‌‌’ అనే ఆర్గనైజేషన్‌‌కు మెంటార్‌‌గా ఉన్నాడు. 
అవేర్​నెస్​ గేమ్స్‌‌
35 ఏండ్లుగా ఈ గేమ్స్‌‌ యూకెలోని ‘వరల్డ్‌‌ ట్రాన్స్‌‌ప్లాంట్‌‌ ఫెడరేషన్’ వాళ్లు నిర్వహిస్తున్నారు. ఇది ఒక నాన్‌‌ ప్రాఫిట్‌‌ ఆర్గనైజేషన్‌‌. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ గేమ్స్ పెడుతున్నారు. వీటితో వచ్చిన డబ్బుతో ఆర్గాన్స్‌‌ కావాల్సిన వాళ్లకు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు. ఈ గేమ్స్‌‌లో పాల్గొనాలంటే డోనర్ అయి ఉండాలి. హెల్దీగా, ఫిట్‌‌గా ఉండాలి. ఆటల్లో ట్రెయిన్‌‌ అయి ఉండాలి. ఈ గేమ్స్‌‌లో దాదాపు 60 దేశాలు పాల్గొంటాయి. 2019లో మన దేశం నుండి 14  మంది పాల్గొంటే, 2023 ఏప్రిల్‌‌లో జరిగే గేమ్స్‌‌కు ఆ సంఖ్య 40కి చేరింది. దీనికి సంబంధించిన వివరాలు వరల్డ్‌‌ ట్రాన్స్‌‌ప్లాంట్‌‌ ఫెడరేషన్ వెబ్‌‌సైట్‌‌లో చూడొచ్చు.