Gold Rate: గురువారం పెరిగిన గోల్డ్-సిల్వర్.. తెలంగాణ నగరాల్లో రేట్లివే..

Gold Rate: గురువారం పెరిగిన గోల్డ్-సిల్వర్.. తెలంగాణ నగరాల్లో రేట్లివే..

Gold Price Today: దాదాపు వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్లు అనూహ్యంగా మళ్లీ పుంజుకున్నాయి. ఇదే సమయంలో వెండి కూడా పెరగటం కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న అనుమానాల వరకు అనేక కారణాలు బంగారం రేట్ల పెరుగుదలకు దారితీస్తున్నాయి. పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్న సంకేతాలతో దాదాపు వారం రోజులుగా తగ్గిన గోల్డ్ గురువారం రోజున మళ్లీ పెరగటం స్టార్ట్ చేసింది. శుభకార్యాలు, పండుగల సమయంలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ నగరాల్లో రేట్లు గమనించటం ముందుగా ముఖ్యం. 

ALSO READ : మెట్రో నగరాల్లో రియల్టీ క్రాష్..

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే ఆగస్టు 20తో పోల్చితే 10 గ్రాములకు ఆగస్టు 21న రూ.60 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.6 స్వల్పంగా పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లను పరిశీలిస్తే.. 

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(ఆగస్టు 21న):

  • హైదరాదాబాదులో రూ.10వేల 075
  • కరీంనగర్ లో రూ.10వేల 075
  • ఖమ్మంలో రూ.10వేల 075
  • నిజామాబాద్ లో రూ.10వేల 075
  • విజయవాడలో రూ.10వేల 075
  • కడపలో రూ.10వేల 075
  • విశాఖలో రూ.10వేల 075
  • నెల్లూరు రూ.10వేల 075
  • తిరుపతిలో రూ.10వేల 075

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఆగస్టు 20తో పోల్చితే ఇవాళ అంటే ఆగస్టు 21న 10 గ్రాములకు రూ.50 పెరుగుదలను చూసింది. దీంతో ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(ఆగస్టు 21న):

  • హైదరాదాబాదులో రూ.9వేల 230
  • కరీంనగర్ లో రూ.9వేల 230
  • ఖమ్మంలో రూ.9వేల 230
  • నిజామాబాద్ లో రూ.9వేల 230
  • విజయవాడలో రూ.9వేల 230
  • కడపలో రూ.9వేల 230
  • విశాఖలో రూ.9వేల 230
  • నెల్లూరు రూ.9వేల 230
  • తిరుపతిలో రూ.9వేల 230

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా ర్యాలీని కొనసాగిస్తోంది. ఆగస్టు 21న కేజీకి వెండి రూ.వెయ్యి పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 26వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.126 వద్ద కొనసాగుతోంది.