Vastu Tips : ఇంటి ఎదురుగా తులసి చెట్టు ఉండొచ్చా.. డాబాపైకి వెళ్లేందుకు ఎన్ని మెట్లు ఉండాలి..!

Vastu Tips : ఇంటి ఎదురుగా తులసి చెట్టు ఉండొచ్చా.. డాబాపైకి వెళ్లేందుకు ఎన్ని మెట్లు ఉండాలి..!

ఇంటిని నిర్మించుకొనేటప్పుడు .. అందులో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి.. అనేది ముందుగా వాస్తు ప్రకారం నిర్దేశించుకొని నిర్మించుకోవాలి.దాదాపుగా   హిందువులకు చెందిన ప్రతి ఇంటిలో తులసి కోట.. తులసి చెట్టు ఉంటుంది.  దీనిని ఇంటికి ఎదురుగా ఉంటే నష్టాలుంటాయా.. అలాగే వాస్తు ప్రకారం ఇంటి పైకి వెళ్లేందుకు ఎన్ని మెట్లు ఉండాలి.. వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ సూచిస్తున్న సలహాలను ఒకసారి పరిశీలిద్దాం. . . 

ప్రశ్న: సింహద్వారానికి ఎదురుగా తులసి కోట ఉండొచ్చా? ఏదిక్కులో తులసి కోట కట్టుకుంటే మంచిది?

జవాబు: ఇంటి ద్వారానికి ఎదురుగా తులసి కోట కట్టుకోవచ్చు. అయితే తూర్పు లేదా ఉత్తర దిక్కులో తులసి కోట కట్టుకోవడం మంచిది.

ప్రశ్న: మెట్లు కట్టుకునేటప్పుడు వాస్తు పాటించాలా? మెట్ల సంఖ్య ఎన్ని ఉండేలా కట్టుకుంటే మంచిది?

జవాబు: ఇంటితోపాటు మెట్ల విషయంలోనూ వాస్తు పాటించాలి. వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి దిక్కులో మెట్లు కట్టుకోవాలి. మెట్లు సరి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి.

►ALSO READ | Bone cancer:బోన్ క్యాన్సర్కు ముందస్తు హెచ్చరిక.. ఈ 7 సంకేతాలు