
ముంబై: ఆసియా కప్‌లో పాల్గొనేందుకు టీమిండియా సెప్టెంబర్ 4 లేదా 5న దుబాయ్‌కు బయలుదేరనుంది. దీంతో ఎలాంటి శిక్షణ శిబిరం లేకుండానే డైరెక్ట్‌గా టోర్నీలో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 9న టోర్నీ ప్రారంభం కానుండగా, 10వ తేదీన తమ తొలి మ్యాచ్‌లో ఇండియా.. యూఏఈతో తలపడుతుంది. ఆ తర్వాత 14న పాకిస్తాన్‌తో, 19న ఒమన్‌తో ఆడనుంది.
జనవరిలో ఇంగ్లండ్‌తో చివరి టీ20 సిరీస్ ఆడిన ఇండియా ప్లేయర్లు ఆ తర్వాత రెండు నెలల పాటు ఐపీఎల్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న చాలా మంది ప్లేయర్లు మెగా లీగ్‌లో దుమ్మురేపారు. దాంతో ప్లేయర్ల పెర్ఫామెన్స్‌పై సంతృప్తితో ఉన్న సెలెక్టర్లు ఎలాంటి శిబిరాన్ని నిర్వహించొద్దని నిర్ణయించినట్లు సమాచారం. ఈ టోర్నీ కోసం బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో15 మందితో కూడిన టీమ్‌ను ప్రకటించింది. టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించింది.