
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్అడ్మిషన్ల గడవును ఈ నెల 31 వరకు పొడిగించినట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలతో పాటు అన్ని రకాల గురుకులాల్లోను ఈ అవకాశం ఉంటుందని చెప్పారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్లు acadtgbie.cgg.gov.in, tgbie.cgg.gov.in లో గుర్తింపుఉన్న కాలేజీల లిస్టులు ఉంటాయని పేర్కొన్నారు.