పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలి : ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి

పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలి : ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
  • ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి

వికారాబాద్​, వెలుగు: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే దాకా ఉద్యమిస్తామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. శనివారం వికారాబాద్​లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నేతలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం నిర్మాణ పనులు పూర్తి చేసిందని, మిగిలిన 10 శాతం పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.