వీధి రౌడీలను మించిన భాష మాట్లాడుతున్నరు : చైర్మన్ రమేశ్ రెడ్డి

వీధి రౌడీలను మించిన భాష మాట్లాడుతున్నరు :  చైర్మన్ రమేశ్ రెడ్డి
  •     కేటీఆర్, హరీశ్‌పై టూరిజం చైర్మన్ రమేశ్​ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: వీధి రౌడీలను మించిన భాషను బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతున్నారని రాష్ట్ర టూరిజం చైర్మన్ రమేశ్‌ రెడ్డి విమర్శించారు.శనివారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న భాషను చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటున్నదని అన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కేటీఆర్ తన తీరును మార్చుకోని పక్షంలో సిరిసిల్లలో ఆయనకు చెప్పుల దండా వేసి చీపుర్లతో కొడుతూ ఊరేగిస్తామని హెచ్చరించారు.