దోహా: ఫిడే వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో ఇండియా లెజెండ్, తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి దూసుకెళ్తోంది. విమెన్స్ ర్యాపిడ్ సెక్షన్‌లో 8 రౌండ్ల తర్వాత టాప్ ప్లేస్‌లో నిలిచింది. శనివారం జరిగిన గేమ్స్‌లో మూడు విజయాలు సాధించి ఓ గేమ్‌ను డ్రా చేసుకున్న ఆమె 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ద్రోణవల్లి హారిక మూడు డ్రాలు, ఒక విజయంతో (5.5 పాయింట్లు) ఆరో ర్యాంక్‌లో ఉంది. ఓపెన్ సెక్షన్‌లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ 5 రౌండ్ల వరకూ జాయింట్ టాప్ ప్లేస్‌లో ఉన్నా ఆ తర్వాత పట్టు విడిచాడు. తర్వాతి నాలుగు రౌండ్లలో ఓ విజయం, ఓటమితో పాటు 2 డ్రాలు నమోదు చేశాడు.
కార్ల్ సన్‌తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను అర్జున్ 101 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. వ్లాడిస్లావ్‌తో తర్వాతి గేమ్‌లో 48 ఎత్తుల వద్ద ఓటమి పాలయ్యాడు. 7, 8వ గేమ్స్‌ను డ్రా చేసుకున్నాడు. ఎస్. ఎల్ నారాయణతో 9వ గేమ్‌లో 40 ఎత్తుల్లో నెగ్గాడు. ప్రస్తుతం అర్జున్ ఆరు పాయింట్లతో 8వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. వరల్డ్ చాంప్ డి. గుకేశ్ 6.5 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉన్నాడు.
