Vastu Tips : కొత్త ఇంటికి పాత హౌస్ మెటీరియల్ వాడొచ్చా.. ఇంటి ఎదురుగా నీటి గుంట ఉండొచ్చా..

Vastu Tips :  కొత్త ఇంటికి పాత హౌస్ మెటీరియల్ వాడొచ్చా.. ఇంటి ఎదురుగా నీటి గుంట ఉండొచ్చా..

ఇంటి నిర్మాణమే కాదు... ఇంటి ఎదురుగా ఏమేమి ఉండాలి.. ఏమేమి ఉండకూడదు అనే విషయాలు కూడా వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. చాలామంది పాత ఇల్లును తీసేసి కొత్త ఇంటిని కట్టుకుంటారు.. అలాంటి సయమంలో పాత ఇంటి సామాను ( తలుపులు.. కిటికీలు..ఇలాఉపయోగపడతాయనుకునేవి) వాడవచ్చా.. వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ ఏమంటున్నారో తెలుసుకుందాం. . . 

ప్రశ్న: పాత ఇంటిని కూల్చేసి, కొత్త ఇంటిని కడుతున్నాం. పాత ఇంటికి సంబంధించిన సామగ్రిని కొత్త ఇంటికి వాడుకోవచ్చా!

జవాబు : కొత్త ఇంటికి కొత్త సామగ్రి వాడటమే మంచిది. ఒకవేళ తప్పనిసరై పాత సామగ్రి వాడినా తప్పులేదు. కిటికీలు. ఇతర సామగ్రి వాడితే చెదలు, తుప్పు పట్టకుండా నాణ్యమైనవే వాడాలని వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ చెబుతున్నారు.

ప్రశ్న: కొత్తగా కట్టుకున్న ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక నీటి గుంట ఉంది. అలా ఉండటం వాస్తు దోషం అంటున్నారు? నిజమేనా?

జవాబు: ఇంటికి ఎదురుగా నీటి గుంట ఉండకూడదు. ఉత్తర ఈశాన్యం లేదా తూర్పు ఈశాన్యంలో గుంట ఉంటే పర్లేదు. ఇంటి ఎదురుగా ఉంటే పరిష్కారం చూసుకోవాలని వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ సూచిస్తున్నారు