
- స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు తపస్ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న బడులను విభజించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేశ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం అందించారు. చాలా స్కూళ్లను విద్యాశాఖ అనుమతితోనే 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసినట్టు చెప్పారు.
పూర్తిస్థాయి హైస్కూల్‌గా మారిన తర్వాత రెండుగా విభజించాల్సి ఉన్నా.. ఇంత వరకూ చేయలేదని పేర్కొన్నారు. మరోపక్క టీచర్లు, పింఛనర్లను వేధిస్తున్న వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోపక్క ఈ నెల23న అన్ని జిల్లాల్లో సీపీఎస్ విధానంపై నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. బడుల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన, మండల, జిల్లా కేంద్రాల్లో అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు చెప్పారు.
=