
ఇప్పటివరకు 1 రూపాయి నాణెం, 2 రూపాయల నాణెం, అలాగే 5 రూపాయల సహా 10 రూపాయల నాణెం ఎక్కువగా చూసుంటాం... మొన్నటివరకు 20 రూపాయల నాణెం కూడా చూసాం.. వీటికి తోడు ఇప్పుడు ఒక కొత్త నాణెం రాబోతుంది. తేరాపంత్ ధర్మ సంఘ్ 10వ అధినేత ఆచార్య మహాప్రజ్ఞ 105వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం త్వరలో రూ.100 నాణెంను విడుదల చేయబోతోంది. అయితే ఈ నాణెం 40 గ్రాముల బరువు ఉంటుందని, స్వచ్ఛమైన వెండితో తయారు చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే 44 మిల్లీమీటర్లతో గుండ్రంగా ఉంటుంది. ఈ నాణెం భారత ప్రభుత్వానికి చెందిన ముంబై మింట్ ముద్రించనుంది. అయితే జూలై 28న ఆవిష్కరించే అవకాశం ఉంది.
ఈ నాణెం జారీ చేయడానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ 24 జూలై 2025న జారీ చేసింది. ఈ నాణెం ఒక వైపు మధ్య భాగంలో ఆచార్య మహాప్రజ్ఞ ఫోటో ఉంటుంది, దాని చుట్టు పైన ఆచార్య మహాప్రజ్ఞ 105వ జయంతి అని హిందీలో కింద చుట్టు ఇంగ్లీషులో వ్రాసి ఉంటుంది.
ALSO READ : నిరసనల మధ్య..లోక్ సభలో పీఎం, సీఎం తొలగింపు బిల్లు..
ఆచార్య మహాప్రజ్ఞ ఫోటో కుడి, ఎడమ వైపున అతని జీవిత కాలం 1920 నుండి 2010 అని ఉంటుంది. ఫోటో క్రింద నాణెం జారీ చేసిన సంవత్సరం 2025 ముద్రించి ఉంటుంది. నాణెం మరొక వైపు అశోక స్తంభం, క్రింద 100 రూపాయి చిహ్నంతో ఉంటుంది, దాని కుడి ఇంకా ఎడమ వైపున భారత్ అలాగే ఇండియా అని హిందీ, ఇంగ్లీషులో రాసి ఉంటుంది.