
బుధవారం(ఆగస్టు20) లోక్ సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది ఎన్డీయే ప్రభుత్వం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా ఎన్నికైన ప్రతినిధులను నేరారోపణలకు సంబంధించి అరెస్టు చేసినా లేదా వరుసగా 30 రోజులు నిర్బంధించినా వారి పదవుల నుంచి తొలగించే ప్రతిపాదనతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టారు.
అయితే ఇది సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది..కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ప్రభుత్వం రాష్ట్రాల్లోని బిజెపియేతర ప్రభుత్వాలను అస్థిరపరచాలని లక్ష్యంగా పెట్టుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ALSO READ : మూసీ ప్రక్షాళన చేసి.. నైట్ మార్కెట్ ను అభివృద్ధి చేస్తాం
అమిత్ షా ప్రవేశపెట్టిన ఈ బిల్లులు:
- రాజ్యాంగ (నూట ముప్పైవ సవరణ) బిల్లు, 2025
- కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు, 2025
- జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2025
సభలో గందరగోళం..
ఈ బిల్లులు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రాల్లోని బిజెపియేతర ప్రభుత్వాలను అస్థిరపరచడానికే అధికార పార్టీ ఈ బిల్లులను తీసుకొస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల అణచివేతకు,వారెన్సీయాని వేధించడానికి ఇవి ఒక సాధనంగా ఉపయోగపడతాయని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కొత్త నిబంధనలు సమాఖ్య వ్యవస్థ (Federal system) ను బలహీనపరుస్తాయని, రాష్ట్ర ప్రభుత్వాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తాయని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అయితే ఈ బిల్లులు రాజకీయాల్లో నేరాలను తగ్గించి, పారదర్శకతను పెంచుతాయని అధికార పక్షం వాదిస్తోంది. ఈ బిల్లులు చట్టాలుగా మారితే భారత రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.