మూసీ ప్రక్షాళన చేసి.. నైట్ మార్కెట్ ను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్

మూసీ ప్రక్షాళన చేసి.. నైట్ మార్కెట్ ను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్

హైదరాబాద్ అభివృద్ది జరగాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనన్నార సీఎం రేవంత్..  అభివృద్దిని అడ్డుకునే వాళ్లే శత్రువులని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి వచ్చే వాళ్లను ప్రజలే అడ్డుకోవాలని సూచించారు రేవంత్. న్యూయార్క్,టోక్యో సింగపూర్ తో హైదరాబాద్ కు పోటీ పడుతుందన్నారు. మూసీ ప్రక్షాళన కొంత మందికి ఇష్టం లేదన్నారు రేవంత్ . హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు .

గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు శంకుస్థాపన చేసిన సీఎం...  మూసీ వద్దంటున్నారు..ఫ్యూచర్ సిటీ వద్దంటున్నారు.  ఆనాడు కూడా ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టును కొందరు హేళన చేశారు.  నాటి సీఎంల ముందు చూపుతోనే ఇవాళ అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ కు  వచ్చాయి.  హైదరాబాద్ ను అభివృద్ది చేయాలంటే  మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.  ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన చేయాలి.  గంగా,యమునా,సబర్మతిని వాళ్లు ప్రక్షాళన చేసుకోలేదా?. గజం స్థలం దొరకనోళ్లు మూసీ మురికిలో  ఇబ్బంది పడుతున్నారు.   మూసీని ప్రక్షాళన చేసి నైట్ మార్కెట్ ను అభివృద్ధి చేస్తాం. మూసీ పరివాహక ప్రాంతంలో 24 గంటలు వ్యాపారం జరిగేలా చూస్తాం.   మూసీలో 24 గంటలు  నీళ్లు ఉండేలా రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం . మూసీ రివర్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తాం. ట్రిపుల్ రావాలంటే నగరం విస్తరించాలి.  ఎలివేటెడ్ కారిడార్లు,మెట్రోను కనెక్టివిటీ చేస్తాం అని అన్నారు రేవంత్.