ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌డీఆర్ పరీక్ష సక్సెస్.. ‘రామ్ జెట్’ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో

ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌డీఆర్ పరీక్ష సక్సెస్.. ‘రామ్ జెట్’ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో

ఢిల్లీ: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌‌‌‌డీఓ) ఒడిశా తీరంలోని చాందీపూర్ సమీపంలో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌‌‌‌జెట్ (ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌డీఆర్) టెక్నాలజీని మంగళవారం ఉదయం 10:45 గంటల సమయంలో విజయవంతంగా ప్రదర్శించింది. ఈ విజయవంతమైన ప్రదర్శనతో భారతదేశం ఈ అధునాతన టెక్నాలజీని కలిగి ఉన్న ప్రపంచంలోని దేశాల జాబితాలో చేరింది. 

ఈ టెక్నాలజీ దీర్ఘ శ్రేణి ఎయిర్-టు-ఎయిర్ మిసైల్స్ అభివృద్ధిని సాధ్యం చేస్తుంది. శత్రువులపై వ్యూహాత్మక విజయాన్ని ఇస్తుంది. గ్రౌండ్ బూస్టర్ మోటార్ ద్వారా మొదట అవసరమైన మాక్ సంఖ్యకు తీసుకెళ్లిన తర్వాత, నాజిల్-లెస్ బూస్టర్, సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌‌‌‌జెట్ మోటార్, ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ వంటి అన్ని ఉపవ్యవస్థలు ఆశించిన విధంగా పని చేశాయి. బెంగాల్ బే తీరంలో ఏర్పాటు చేసిన అనేక ట్రాకింగ్ ఇన్‌‌‌‌స్ట్రుమెంట్ల ద్వారా సేకరించిన ఫ్లైట్ డేటా ద్వారా సిస్టమ్ పనితీరును ధ్రువీకరించారు.