వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా వినయ్ రత్నం దర్శకత్వంలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాల కృష్ణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీచిదంబరం గారు’. నిర్మాత వంశీ నందిపాటి ఫిబ్రవరి 6న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ ‘ఒక మనిషిని నువ్వు ప్రేమించగలగాలి అంటే మొదట నిన్ను నువ్వు ప్రేమించాలి అనేది ఈ కథ సారాంశం. పక్క వాళ్లతో పోల్చుకుంటూ లైఫ్‌ను లీడ్ చేస్తున్న ప్రస్తుత సమాజ తీరును సున్నితమైన భావోద్వేగాలతో చెప్పాలనుకున్నా.
చిదంబరం అనే పాత్రను సింగిల్ టేక్‌లో ప్లే చేయాలి. కథ అనుకున్నప్పుడే వంశీని హీరోగా అనుకున్నా. మెల్ల కన్నుతో ఈ పాత్ర చేయడం అంత ఈజీ కాదు. దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. మెల్లకన్ను ఉన్న వాళ్లను తూర్పు గోదావరి జిల్లాలో చిదంబరం అని ఏడిపిస్తుంటారు. అందుకే దీనికి ఈ టైటిల్ పెట్టాం. నేచురాలిటీ కోసం మిగతా ఆర్టిస్టులందరిని ఈస్ట్ గోదావరిలో ఆడిషన్ చేసి తీసుకున్నా. ఇదొక ప్యూర్ ఎమోషనల్ జర్నీ.
అలాగే ఎవ్వరినీ ఇబ్బంది పెట్టని క్లీన్ కామెడీ ఉంటుంది. కీరవాణి గారు పాడిన పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. మొదట ఈ సినిమా క్రౌడ్ ఫండింగ్‌తో స్టార్ట్ చేశాం. ఆ తరువాత నిర్మాత చింతా గోపాల కృష్టారెడ్డి గారికి కథ నచ్చి ప్రొడ్యూస్ చేశారు. ప్రీమియర్స్ చూసిన వారంతా కేరాఫ్ కంచరపాలెం, పెళ్లి చూపులు చిత్రాలతో పోల్చడం ఆనందంగా అనిపించింది’ అని చెప్పాడు.
