ఇండియా ఫుట్‌‌బాల్‌‌ టీమ్‌‌ శుభారంభం

 ఇండియా ఫుట్‌‌బాల్‌‌ టీమ్‌‌  శుభారంభం

థింపు: శాఫ్‌‌ అండర్‌‌–17 విమెన్స్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా ఫుట్‌‌బాల్‌‌ టీమ్‌‌ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌‌లో ఇండియా 7–0తో నేపాల్‌‌పై గెలిచింది. ఇండియా తరఫున నీరా చాను లాంగ్జామ్‌‌ (25, 56వ ని), అభిస్టా బాస్నెటీ (16, 41వ ని), అన్షుకా కుమారి (37, 62వ ని) తలా రెండు గోల్స్‌‌ కొట్టగా, జులన్‌‌ (45+1వ ని) ఒక గోల్‌‌ చేసింది. 

స్టార్టింగ్‌‌ నుంచే దూకుడుగా ఆడిన ఇండియన్‌‌ ప్లేయర్లు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వీలైనప్పుడల్లా ప్రత్యర్థి శిబిరంలోకి దూసుకుపోయి నేపాల్‌‌ డిఫెన్స్‌‌ను చిత్తు చేశారు. ఫలితంగా తొలి హాఫ్‌‌ ముగిసేసరికి 5–0 లీడ్‌‌లో నిలిచారు. రెండో హాఫ్‌‌లోనూ నేపాల్‌‌ ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. కనీసం ప్రతి దాడులతో దీటైన జవాబు కూడా ఇవ్వలేకపోయింది.