దోహా: స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్.. ఈ ఏడాది ఓటమన్నదే లేకుండా దూసుకుపోతున్నాడు. తాజాగా ఖతార్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శనివారం రాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ అల్కరాజ్ 6–2, 6–1తో ఆర్థర్ ఫిల్స్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. దాంతో ఈ ఏడాది తన విజయాల సంఖ్యను 12కు పెంచుకున్నాడు. 50 నిమిషాల పోరులో అల్కరాజ్ బలమైన సర్వీస్‌లు, ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో రెచ్చిపోయాడు. 20 రోజుల కిందట ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన 22 ఏళ్ల స్పానిష్ ప్లేయర్.. దోహా టైటిల్‌తో టూర్ స్థాయి టైటిళ్ల సంఖ్యను 26కు పెంచుకున్నాడు.
