
ఇది కరీంనగర్ లో స్వీట్ ప్రియులకు గుండె పగిలిపోయేలాంటి వార్త. రోజూ స్వీట్ షాపుకు వెళ్లి కొనుక్కొని ఇష్టంగా తినేవారు ఇది తెలిస్తే.. అటు వైపు చూడటానికి కూడా ఇష్టపడరు. కరీంనగర్ లోని స్వీట్ షాప్స్ లో ఫుడ్ సేఫ్టీ రైడ్స్ లో అంతటి దారుణాలు బయటపడ్డాయి మరి.. బుధవారం ( ఆగస్టు 20 ) కరీంనగర్ టౌన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక టవర్ సర్కిల్ దగ్గర ఉన్న అనిల్ స్వీట్స్ అండ్ బేకరీ, ఆనంద్ స్వీట్స్, ముకరంపుర లోని మహారాజా స్వీట్స్ షాపులో తనిఖీలు నిర్వహించారు అధికారులు.
ఈ షాపులలో స్వీట్స్ తయారు చేసే కిచెన్ ఏరియా పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు.డ్రైనేజీ బ్లాక్ అవ్వడంతో కిచెన్ అంతా దుర్వాసన వ్యాపించినట్లు గుర్తించారు అధికారులు.కవర్ చేయని స్వీట్స్ పై బల్లుల మలం, పాలను నిల్వ చేసిన టిన్స్ లో ఈగలు, దోమలు పడినట్లు గుర్తించారు.
అంతే కాకుండా.. పరిమితికి మించి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు అధికారులు. పనిచేసే సిబ్బంది ఎలాంటి పరిశుభ్రమైన పద్ధతులు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు. సదరు స్వీట్స్ షాపుల్లో నాణ్యత లోపించిన స్వీట్స్ గుర్తించి బయట పడేశారు అధికారులు. ఓ స్వీట్ షాపులో 20 లీటర్ల పాలు పారబోసినట్లు తెలిపారు అధికారులు. మరో స్వీట్ షాపులో పురుగుల మలినాలు ఉన్న 10 కిలోల బాదుషా, 3 కిలోల ఖారా పారవేసినట్లు తెలిపారు.
నాణ్యత ప్రమాణాలు పాటించని స్వీట్ షాప్స్ నుంచి స్వీట్స్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు అధికారులు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు అధికారులు. ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ రాగానే స్వీట్ షాప్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు.