
ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తున్న కేరళకు చెందిన 26 ఏళ్ల యువకుడు కర్ణాటక రాజధానితో తనకున్న అనుబంధాన్ని రెడిట్లో పోస్ట్ చేసాడు. అందులో బెంగళూరు సిటీ తనకు ప్రేమ-ద్వేషం సంబంధంలా ఎందుకు అనిపిస్తుందో, ఇక్కడ జీవితం ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు. ఇంకా బెంగళూరు వాతావరణం నా సహనాన్ని ఎలా పరీక్షించిందో, అలాగే ఏ విధంగా ఆకట్టుకుందో తెలిపాడు.
నేను నాలుగు ఏళ్లకి పైగా బెంగళూరులో ఉంటున్నాను, ఈ సిటీ నాకు ఎం చేసిందో నా ఊహకు అందనిది. ఉదయం చాలా ఎండగా ఉంటుంది, ఆలా అని రోజంతా కూడా ఎండగా ఉంటుందని మీరు అనుకుంటారు. దింతో గొడుగు లేదా రెయిన్ కోట్ అవసరమా... అని బయటికి వెళ్తారు. రెండు నిమిషాల తర్వాత ఒక్కసారిగా అంత మారిపోయి ఫుల్ వర్షం పడుతోంది. దింతో మీరు ట్రాఫిక్ మధ్యలో నిలబడి తడిసిపోతారు అని చెప్పాడు.
ఇవ్వని అతన్ని మళ్ళీ కేరళకు తిరిగి వెళ్లేల చేసింది, కానీ వెళ్లే వరకు అంటే అతని సంతూర్ కన్నూర్ తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరు చల్లటి వాతావరణం, స్వేచ్ఛ మిస్ అవుతున్నట్లు అనిపించిందట.
ALSO READ : కోనసీమ కొబ్బరి తోటల్లో రేవ్ పార్టీ
అతను భారతదేశంలోని చాల చోట్ల ఉన్ననని చెబుతూనే.. బెంగళూరు ప్రత్యేకమైనది. ఉద్యోగం కోసం వేరే నగరానికి వెళ్లడం నాకు కష్టంగా అనిపించడానికి ఇదే కారణం, ఇంకా ఇక్కడ చాలా మంది మలయాళీలు, రెస్టారెంట్లు ఉండటం కూడా ఒక కారణమని అన్నారు. అతను చేసిన రెడ్డిట్ పోస్ట్ పై సోషల్ మీడియా యూజర్లు కూడా బెంగళూరు గురించి వాళ్ళ అనుభవాలను చెప్పుకున్నారు.
బెంగళూరు అవకాశాల పరంగా ముఖ్యంగా ఐటీ రంగం చాలా బాగుటుంది. ఇక్కడ వాతావరణం అద్భుతం. కేరళలో చాలా వేడిగా ఉండటం వల్ల అక్కడ నుండి పని చేయలేము. బెంగళూరులో కొంతమంది ఆసక్తికరమైన వ్యక్తులను కూడా కలిశాను అని ఒకరు అనగా, మరొకరు రెండు సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ఉంటున్నాను. కానీ ఇప్పుడు నేను 25 డిగ్రీల కంటే ఎక్కువ వాతావరణాన్ని తట్టుకోలేను. ఇంటికి తిరిగి వెళ్తే నేను ఓవెన్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది అని అన్నారు. అయితే కొంతమంది నెటిజన్లు బెంగళూరులో పెరుగుతున్న బాధలను గుర్తుచేసుకుంటూ కామెంట్లు కూడా చేసారు.