ఆధ్యాత్మికం: జ్ఞానోదయం అంటే ఏమిటి.. బుద్దుడు వివరణ ఇదే..!

ఆధ్యాత్మికం: జ్ఞానోదయం అంటే ఏమిటి.. బుద్దుడు వివరణ ఇదే..!

 గౌతమ బుద్దుడు.. మహోన్నత వ్యక్తి... ఆధ్మాత్మిక వేత్త.. సనాతన ధర్మాన్ని కాపాడిన వారిలో ఒకరు..   ఆయన  జ్ఞానోదయం ఉన్న వారు ఏదైనా సాధిస్తారని ఆయన శిష్యులకు చెప్పాడు.  అసలు  జ్ఞానోదయం అంటే ఏమిటి.. బుద్దుడు దాని గురించి ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం. . .

ఒకవేళ గౌతమ బుద్ధుడు ఈ రోజు మనల్ని విజిట్ చేయడానికి వస్తే. భారతదేశంలోకి ప్రవేశించడానికి ఆయనకు పాస్​ పోర్ట్, ట్రావెల్ డాక్యుమెంట్, నేషనాలిటీ ప్రూఫ్ అవసరమా?  ఢిల్లీలో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్​ లో  బుద్ధుడు భారతీయుడే ..  అని మన ఫారిన్ మినిస్టర్  చేసిన కామెంట్​కి.. నేపాల్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పిన సందర్భంలో మనం ఈ ప్రశ్న వేసుకోవడంలో తప్పులేదని కొంతమంది అంటున్నారు. 

మీరు గుర్తుంచుకోగలిగిన గొప్ప మ భారతీయులు ఎవరు?" అనడిగితే... ఒకరు గౌతమ బుద్ధుడు, మురొకరు మహాత్మా 'గాంధీ' అని ఫారిన్ మినిస్టర్ జైశంకర్ ఆ స్పీచ్ లో అన్నాడు. జైశంకర్ కామెంట్ కి  స్పందిస్తూ నేపాల్ ప్రభుత్వం ముందలింపుగా ఒక ప్రకటన జారీ చేసింది. గౌతమ బుద్ధుడు నేపాల్​ లో  ఉన్న లుంబినిలో పుట్టాడు. దీనికి చారిత్రక, పురావస్తు ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రూఫ్ ఎవరూ కాదనలేని నిజం. బుద్ధుడు పుట్టిన లుంబిన్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది అని ఆ ప్రకటన సారాంశం

సందేహం లేదు

గౌతమబుద్ధుడు నేపాల్​ లోని లుంబినిలో పుట్టాడు అనడంలో ఎవరికీ ఎలాంటి సందే హం లేదు మన దేశంలో బుద్ధుడి ప్రభావం, ప్రభావితం చేసిన ఆయన ఐడియాలజీ వాటి తాలూకు వారసత్వం మనమూ బౌద్ధంలో భాగమని సూచిస్తున్నాయి. ఈ ఉద్దేశంతోనే, ఈ పరిశీలనతోనే జైశంకర్ కామెంట్స్ చేశాడని ఎవరికైనా అర్థమవుతుంది!
కానీ, నేపాల్​ దీనికి ఊహించని విధంగా స్పందించింది. 

►ALSO READ | Vastu Tips : ఇంటి ఎదురుగా తులసి చెట్టు ఉండొచ్చా.. డాబాపైకి వెళ్లేందుకు ఎన్ని మెట్లు ఉండాలి..!

మనదేశ భూభాగంలోని కొన్ని భాగాలు నేపాల్​ కు  చెందినవిగా చూపించే మ్యాప్​ ను  విడుదల చేయాలని చైనానే ఎంకరేజ్ చేసినట్లు నేపాల్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ టైంలో నేపాల్ ఇలా మాట్లాడితే రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి అనడం నిజం. 

ఒక్కోసారి వీక్ గా ఒక్కోసారి స్ట్రాంగ్ గా

మన దేశానికి, నేపాల్​ కు  మధ్య సంబంధాలు ఒక్కోసారి వీక్ గా, మరోసారి స్ర్టాంగ్​ గా  కొనసాగుతున్నాయి. ఫ్యూచర్​ లోనూ ఈ సంబంధాలు ఇలాగే ఉంటాయి. అయితే, ఇన్నాళ్లు అప్పుడప్పుడు ఇలాంటి పొరపచ్చాలు రావడం సహజమే అయినా మొదటిసారి ఈ సమస్యను బుద్దుడి మీద నుంచి లేవనెత్తారు.

వీళ్లంతా హీరోస్

ప్రిన్స్ సిద్ధార్డ్.. బుద్ధుడిగా పరిణామం  చెందే సమయంలో ఇదినేపాల్ అది ఇండియా..  అని పిలవడానికి భౌగోళిక నిర్మాణంగానీ, పొలిటికల్ డిసిప్లీన్​ గానీ, మోడర్న్​ కార్టోగ్రఫీగానీ ఏమీ లేవు. అప్పట్లో నేపాల్ వాళ్లను 'నేపాలీలు అని, మనను 'భారతీయులనీ' పిలిచేవారూ లేరు. ఆయన ఏ నేలపై పుట్టాడు? ఏ దేశం వాడు? లాంటి విషయాల్ని ఒక నిమిషం పక్కనపెడితే బుద్ధుడు ఒక యూనిక్ క్లాస్ కి చెందినవాడు. ఈ క్లాస్​ కు  చెందినవాళ్లను ''హీరోస్' అంటారని..  ఫేమస్ హిస్టారియన్ థామస్ కార్​ లైల్​ చెప్పాడు. క్యాపిటల్ 'హెచ్ 'గా పిలిచే ఈ క్లాస్​ లోనే... బుధునితో పాటు, జీసెస్ క్రైస్ట్, మహావీర్, గురునానక్ లాంటివాళ్లు ఉంటారు. ఈ హీరోలంతా గొప్ప ఆధ్యాత్మిక గురువులు  వీళ్లను చరిత్ర నిర్మించలేదు. వీళ్లే చరిత్రను నిర్మించారు! వీళ్లు నాగరికతల గమనాన్ని మార్చినవారు. ఇంటర్నల్ ఫోర్స్ ద్వారా మనుషులు కాన్షియస్ నెస్​ ను  మార్చినవారు..  పరిపాలించే రాజు కంటే కూడా వీళ్లు శక్తివంతమైనవారు. మనుషులుగా పుట్టిన ఈ మహాత్ములు.. ఏ ఒక్క మనిషికో, తెగకో చెందినవారు కాదు.

బుద్దుడి చివరి సందేశం

బుద్ధుడు తన జర్నీలో చివరిదశకు చేరుకున్నాడు. ఈ భూమిని విడిచి వెళ్లే ముందు ఆయన శిష్యులంతా ఆయన చుట్టూ గుమిగూడి తను 'జ్ఞానోదయం' తాలూకు ప్రయాణం గురించి చివరి సందేశం ఇవ్వమని కోరాడు. దానికి బుద్దుడు తన నీళ్ల గినెను తీసుకొనితలకిందులు చేశాడు. ఒక్క చుక్క లేకుండా నీళ్లు కిందపోయాయి. ఈ బోర్లించి ఉన్న నీటి గిన్నె (ఇసవర్టెడ్ వెజల్)నే బౌద్ధ స్థూపానికి ప్రేరణ..  బుద్ధుడు దాన్ని తలకిందులుగా చేయడం వెనక ఉన్న ఉద్దేశం. అలా మనం కూడా ఎంప్టీగా మారాలని, ఇగోలు లేని ఎంప్టీనెస్ సాధ్యమైనప్పుడే జ్ఞానోదయం సాధ్యం అని చెప్పాడు. 'నేను, నాది' అనుకోవడమే అహం! ఈ సరిహద్దులను దాటినవాళ్లకే, బుద్ధుడుకి ఏ సరిహద్దులూ లేవని అర్దమవుతుంది! బుద్ధుడు ఎవరికి చెందినవాడు? అంటే అందరివాడు! అలాగే ఏ ఒక్కరికీ చెందినవాడు కాదు..!