
- పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న జాబితా
- సింగిల్ నేమ్ నియోజకవర్గాల అభ్యర్థులు వీళ్లేనంటూ చర్చ
- లిస్టులో ఇటీవల పార్టీలో చేరినోళ్ల పేర్లు
- సీనియర్లు పొన్నాల, నాగం, చిన్నారెడ్డికి దక్కని చోటు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ ఇంకా పెట్టనే లేదు. అభ్యర్థుల జాబితాపై ఇంకా తుది నివేదికను ఇవ్వనేలేదు. కానీ సింగిల్ నేమ్ నియోజకవర్గాల్లో పార్టీ పెద్దలు ఇప్పటికే ఓ జాబితాను తయారు చేశారన్న చర్చ జరుగుతున్నది. సింగిల్ నేమ్ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల లిస్ట్ ఇదేనంటూ ఓ జాబితా పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నది. ఉమ్మడి జిల్లాల వారీగా 71 మంది అభ్యర్థులతో కూడిన ఇదే లిస్ట్‌ని స్క్రీనింగ్ కమిటీ ఆమోదించి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి అందజేస్తుందన్న చర్చ పార్టీ నేతల్లో జరుగుతున్నది. అయితే ఈ జాబితాలో పొన్నాల లక్ష్మయ్య, చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి వంటి సీనియర్ల పేర్లు లేకపోవడం గమనార్హం. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన నేతలకు టికెట్లు దక్కినట్టు లిస్టు ద్వారా తెలుస్తున్నది. భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వర్ రావు, కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు ఉన్నాయి. ఇక కసిరెడ్డి నారాయణ రెడ్డి, వేముల వీరేశం, మైనంపల్లి హన్మంతరావు, ఆయన కొడుకు రోహిత్ రావుకు వాళ్లు ఆశిస్తున్న స్థానాల్లోనే టికెట్లు దక్కినట్టు లిస్టులో ఉంది.
ఉమ్మడి మహబూబ్ నగర్
కొడంగల్–రేవంత్ రెడ్డి
నారాయణపేట–ఎర్ర శేఖర్
జడ్చర్ల–అనిరుధ్ రెడ్డి
షాద్ నగర్–వీర్లపల్లి శంకర్
కొల్లాపూర్–జూపల్లి కృష్ణారావు
అచ్చంపేట–వంశీకృష్ణ
అలంపూర్–సంపత్ కుమార్
మక్తల్–కొత్తకోట సిద్దార్థ రెడ్డి
దేవరకద్ర–జి.మధుసూదన్ రెడ్డి
వనపర్తి–మేఘారెడ్డి
గద్వాల్–సరిత తిరుపతయ్య
కల్వకుర్తి–కసిరెడ్డి నారాయణ రెడ్డి
నాగర్ కర్నూల్–కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
మహబూబ్ నగర్–యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
ఉమ్మడి నల్గొండ
హుజూర్ నగర్–ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ–పద్మావతి
నల్గొండ–కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఆలేరు–బీర్ల ఐలయ్య
నాగార్జునసాగర్–కుందూరు జైవీర్ రెడ్డి
దేవరకొండ–వడ్త్య రమేశ్ నాయక్
నకిరేకల్–వేముల వీరేశం
భువనగిరి–కుంభం అనిల్ కుమార్ రెడ్డి
సూర్యాపేట–పటేల్ రమేశ్ రెడ్డి
ఉమ్మడి ఖమ్మం
మధిర–భట్టి విక్రమార్క
భద్రాచలం–పొదెం వీరయ్య
పాలేరు–తుమ్మల నాగేశ్వర్రావు
కొత్తగూడెం–పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఇల్లందు–కోరం కనకయ్య
ఉమ్మడి వరంగల్
ములుగు–సీతక్క
వరంగల్ ఈస్ట్–కొండా సురేఖ
భూపాలపల్లి–గండ్ర సత్యనారాయణ
జనగామ–కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
వరంగల్ వెస్ట్–నాయిని రాజేందర్ రెడ్డి
పరకాల–కొండా మురళి
నర్సంపేట–దొంతి మాధవరెడ్డి
మహబూబాబాద్–మురళీ నాయక్
ఉమ్మడి ఆదిలాబాద్
మంచిర్యాల–ప్రేమ్ సాగర్ రావు
ఆదిలాబాద్–కంది శ్రీనివాస్ రెడ్డి
నిర్మల్–కూచాడి శ్రీహరి రావు
ముధోల్–ఆనంద్ రావు పటేల్
సిర్పూర్–రావి శ్రీనివాస్
బెల్లంపల్లి–గడ్డం వినోద్
ఉమ్మడి కరీంనగర్
మంథని– శ్రీధర్ బాబు
జగిత్యాల– జీవన్ రెడ్డి
వేములవాడ– ఆది శ్రీనివాస్
ధర్మపురి– లక్ష్మణ్
హుజూరాబాద్– బల్మూర్ వెంకట్
పెద్దపల్లి– విజయరమణ రావు
కోరుట్ల–జువ్వాడి నర్సింగ్ రావు
సిరిసిల్ల– కేకే మహేందర్ రెడ్డి
రామగుండం– రాజ్ ఠాకూర్
హుస్నాబాద్– పొన్నం ప్రభాకర్
మానకొండూర్– కవ్వంపల్లి
సత్యనారాయణ
ఉమ్మడి నిజామాబాద్
కామారెడ్డి–షబ్బీర్ అలీ
నిజామాబాద్ అర్బన్–ధర్మపురి
సంజయ్
బాన్సువాడ–కాసుల బాలరాజ్
బాల్కొండ–సునీల్ రెడ్డి
ఉమ్మడి మెదక్
సంగారెడ్డి–జగ్గారెడ్డి
జహీరాబాద్–ఎ. చంద్రశేఖర్
ఆందోల్–దామోదర రాజనర్సింహ
పఠాన్ చెరు–కాట శ్రీనివాస్ గౌడ్
నర్సాపూర్–గాలి అనిల్ కుమార్
మెదక్–మైనంపల్లి రోహిత్ రావు
గజ్వేల్–నర్సారెడ్డి
ఉమ్మడి రంగారెడ్డి
పరిగి–రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్–గడ్డం ప్రసాద్ కుమార్
మహేశ్వరం–చిగురింత పారిజాత
మల్కాజ్ గిరి–మైనంపల్లి హన్మంతరావు
ఉమ్మడి హైదరాబాద్
ఖైరతాబాద్–రోహిన్ రెడ్డి
నాంపల్లి–ఫిరోజ్ ఖాన్
ముషీరాబాద్–అంజన్ కుమార్