ప్రధాని మోడీ రైతు పక్షపాతి కాదు

ప్రధాని మోడీ రైతు పక్షపాతి కాదు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో 750 మంది వరకు రైతులు చనిపోయారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. అయినప్పటికీ... కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం సంతాపం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తమ పక్షపాతి కాదని రైతులు నమ్ముతున్నారని తికాయత్ చెప్పారు. పైగా మోడీ తమను ఈ దేశంతో సంబంధం లేని వ్యక్తులుగా చూస్తున్నారని రైతులు భావిస్తున్నారని అన్నారు.

మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నఉద్యమంలో 600 మందికి పైగా చనిపోయారని... అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని  మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మండిపడ్డారు. జంతువులు చనిపోతేనే గోల చేసే ఢిల్లీ నేతలు... చనిపోయిన రైతులకు లోక్ సభలో సంతాపం తెలపలేరా..? అని ప్రశ్నించారు. గవర్నర్ పదవి నుంచి దిగిపోమ్మని ఢిల్లీ నేతలు చెబితే అలానే చేస్తానని స్పష్టం చేశారు సత్యపాల్ మాలిక్.