రిపబ్లిక్ ​డే పరేడ్​లో ‘నారీ శక్తి’ పేరుతో మహిళా సైనికుల విన్యాసాలు

రిపబ్లిక్ ​డే పరేడ్​లో ‘నారీ శక్తి’ పేరుతో మహిళా సైనికుల విన్యాసాలు

న్యూఢిల్లీ :  రిపబ్లిక్ ​డే పరేడ్​లో ‘నారీ శక్తి’ పేరుతో మహిళా సైనికులు చేసిన కవాతు ఆకట్టుకున్నది. 260 మంది సీఆర్‌‌పీఎఫ్‌‌, బీఎస్‌‌ఎఫ్‌‌, ఎస్‌‌ఎస్‌‌బీ మహిళా సైనికులు విన్యాసాలు చేశారు. తొలిసారి బీఎస్‌‌ఎఫ్‌‌ మహిళా బ్రాస్‌‌ బ్యాండ్‌‌ ఈ పరేడ్‌‌లో పాల్గొంది. ఇండో- టిబెటన్‌‌ బార్డర్‌‌ పోలీస్‌‌ మహిళా బ్యాండ్‌‌ బృందం కర్తవ్య మార్గంలో కవాతు చేసింది. బ్యాండ్​కమాండర్​ అంబికా పాటిల్​ ఆధ్వర్యంలో ఇండో టిబెటెన్​ బార్డర్​ ఫోర్స్(ఐటీబీపీ) ‘మహిళా బ్యాండ్ కంటింజెంట్’ ‘సారే జహా సే అచ్చా’ ట్యూన్‌‌కు కవాతు చేసింది.

ముగ్గురు సబార్డినేట్ అధికారులు,144 మంది ఇతర ర్యాంకులు కలిగిన మహిళా బృందానికి అసిస్టెంట్ కమాండెంట్ మోనియా శర్మ నాయకత్వం వహించారు. ఐటీబీపీ లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన సరిహద్దు ప్రాంతాల్లో 3,488 కిలోమీటర్ల మేర కాపలాగా ఉంటారు. దేశంలోని అనేక పారామిలటరీ బలగాల్లో ఒకటైన ఐటీబీపీ సాహస కార్యకలాపాల్లో ఎప్పుడూ ముందుంటుంది.