
ట్రాఫిక్ చలాన్ అంటేనే వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. అలాంటిది హైదరాబాద్ లోని కుషాయిగూడ లో ఓ వ్యక్తి తన కారుపై రూ. 76 వేల చలాన్ తో ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఈసీఐఎల్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డ శ్రీనివాస్ అనే వాహనదారుడి కారుపై రూ.76425 చలాన్ ఉండటంతో ఆశ్చర్యపోయారు. ఇన్నోవా వాహనం నెంబర్ TS07EB1115 పైన ఉన్న మొత్తం చలాన్ రూ.76425 ను శ్రీనివాస్ రెడ్డితో మీ సేవలో కట్టించారు ట్రాఫిక్ పోలీసులు.