భీమా నదికి కర్నాటక నుంచి 8 లక్షల క్యూసెక్కులు విడుదల

భీమా నదికి కర్నాటక నుంచి 8 లక్షల క్యూసెక్కులు విడుదల

భీమా నదికి మస్తు వరద

కర్నాటక నుంచి 8 లక్షల క్యూసెక్కులు విడుదల

నాలుగు గ్రామాలను ఖాళీ చేయిస్తున్న​ అధికారులు

నదీ పరివాహక ప్రాంతాలకు హెచ్చరికలు జారీ

మక్తల్, వెలుగు: కృష్ణా, భీమా నదులకు వరద పోటెత్తుతుండడంతో కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్​చేస్తున్నారు. ఐదు రోజులుగా కర్నాటక, మహారాష్ట్రలో వర్షాలు ఎక్కువగా పడుతుండటంతో వరద ప్రవాహం పెరిగింది. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. తాజాగా బీమా నదికి 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు కర్నాటక అధికారులు నారాయణపేట జిల్లా అధికారులకు సమాచారం అందించారు. దీంతో లోతట్టు ప్రాంతాలైన హిందూపూర్, గుర్జాల, కుసుమూర్తి, మారుతీనగర్​ గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ గ్రామాలతోపాటు కృష్ణా, మాగనూర్, మక్తల్ ​మండలాల్లోని నదీ పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్​ చేశారు. నారాయణపేట ఆర్డీవో శ్రీనివాస్​శనివారం సాయంత్రం నుంచి హిందూపూర్​లోనే ఉన్నారు. గ్రామస్తులను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కర్నాటక ప్రభుత్వం శనివారం రాత్రికి నీటిని విడుదల చేస్తే ఆదివారం ఉదయం 10 గంటల వరకు కృష్ణా మండలంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

For More News..

మూసివేత దిశగా మంచిర్యాల సిమెంట్ కంపెనీ

కొండచరియలు విరిగిపడి తెలంగాణ జవాను మృతి

నేటి నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు