నిజామాబాద్ జిల్లాలో గంజాయికి బానిసలై.. స్వచ్ఛందంగా పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు..!

నిజామాబాద్ జిల్లాలో గంజాయికి బానిసలై.. స్వచ్ఛందంగా పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు..!

బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో డ్రగ్స్‌‌‌‌కు వ్యతిరేకంగా పోలీసులు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. బాల్కొండ పోలీస్ స్టేషన్‌‌‌‌కు 8 మంది యువకులు తమంతట తామే వచ్చి గంజాయి అలవాటుందని, దాని నుంచి బయటపడలేకపోతున్నామని, తమను రీహాబిలిటేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు పంపాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎస్సై శైలేందర్‌‌‌‌‌‌‌‌ యువకులను అభినందించి రీహాబిలిటేషన్‌‌‌‌కు పంపిస్తామని హామీ ఇచ్చారు.