
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్వంలో స్క్రూట్నీ పూర్తయింది. 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. 17 గంటల పాటు స్కూట్నీ నిర్వహించగా..130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. స్క్రూట్నీ అనంతరం 81 మంది వేసిన 135 నామినేషన్లు ఆమోదించినట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు. అక్టోబర్ 23న ఎవరూ నామినేషన్ విత్ డ్రా చేసుకోలేదు. ఇదిలా ఉండగా అక్టోబర్ 24 వరకు విత్ డ్రాలకు అవకాశం ఉంది. రేపు సాయంత్రం 3 గంటల తర్వాత బరిలో ఎంత మంది నిలుస్తారో వారికి గుర్తులు కేటాయించనున్నారు అధికారులు.
బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్లు ఆమోదించారు అధికారులు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 24 వరకు సమయం ఉన్నందును తుది బరిలో ఎంత మంది నిలుస్తారనేది తేలనుంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్, జూబ్లీహిల్స్ లో గెలవాలని అధికార పార్టీ, సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ .. 14న కౌంటింగ్ జరగనుంది.