
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 85 మంది పట్టుబడ్డారు. 40 కార్లు, 42 బైకులు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. మద్యం తాగి పట్టుబడ్డ ఓ యువతి హల్ చల్ చేసిది. మరో యువకుడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. కారు నెంబర్ ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ట్రాఫిక్ పోలీసులు.