హాస్టల్కు వెళ్లడం ఇష్టం లేక బాలిక సూసైడ్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

హాస్టల్కు వెళ్లడం ఇష్టం లేక బాలిక సూసైడ్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

ములకలపల్లి, వెలుగు: హాస్టల్​కు వెళ్లడం ఇష్టం లేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామానికి చెందిన వేముల ఉమ(14) అశ్వారావుపేటలోని ఓ హాస్టల్​లో ఉంటూ 8వ తరగతి పూర్తి చేసింది.

 సోమవారం స్కూళ్లు ప్రారంభం కావడంతో 9వ తరగతిలో చేరాల్సి ఉంది. హాస్టల్​కు వెళ్లబోనని ఉమ చెప్పింది. తల్లి శివపార్వతి తన చిన్న కూతురును హాస్టల్​లో చేర్పించేందుకు అశ్వారావుపేటకు వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఉమ హాస్టల్​కు వెళ్లడం ఇష్టం లేక ఉరి వేసుకుంది. ఉమ తండ్రి వీరస్వామి ఆరేండ్ల క్రితం మృతిచెందాడు. తల్లి కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను  పోషిస్తోంది.