షాద్​నగర్​డిపో 9 కొత్త బస్సులు ప్రారంభం

షాద్​నగర్​డిపో 9 కొత్త బస్సులు ప్రారంభం

షాద్ నగర్, వెలుగు: ప్రజలకు నిత్యం రవాణా సౌకర్యం అందుబాటులోకి తెచ్చేలా కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తున్నట్టు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. వివిధ గ్రామాలకు కొత్తగా 9 బస్సులను ఏర్పాటు చేయగా సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్థానిక బస్ డిపోలో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను కూడా ఓపెన్ చేశారు. 

 నిత్యం వివిధ పనుల కోసం వెళ్లే ఉద్యోగులు, కార్మికులు,కూలీలు, చదువుల కోసం వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం అన్ని రూట్లలో బస్సులు నడిపేలా తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ ఉష, జడ్పీటీసీ వెంకటరామిరెడ్డి,ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, ముబారక్ అలీ ఖాన్, అందే హన్,లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు ఉన్నారు.