
17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటింగ్ తేదీలను ప్రకటించింది. ఇవాళ్లి నుంచే కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈసీ సునీల్ అరోరా చెప్పారు. ఏప్రిల్ 11న ఎన్నికలు మొదలు కానున్నాయి. ఏడు దశల పోలింగ్ మే 19న ముగుస్తుంది. మే 23న ఎన్నికల ఫలితాలు వస్తాయి.
ఈ సారి 90 కోట్ల మంది భారతీయులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈసీ ప్రకటించింది. 2014 నుంచి ఐదేళ్లలో కొత్తగా 8.43 కోట్ల కొత్త ఓటర్లు పెరిగారు. 90 కోట్లకు చేరిన మొత్తం ఓటర్లలో 1.5 కోట్ల మంది 18 – 19 ఏళ్ల మధ్య వారే ఉన్నారు.
10 లక్షల పోలింగ్ కేంద్రాలు
దేశ వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు 10 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 9 లక్షలు. అంటే ఈ సారి లక్ష ఓటింగ్ కేంద్రాలు పెరిగాయి. అయితే ఒక ప్రత్యేక ఏంటంటే గత ఎన్నికలను 9 దశల్లో నిర్వహించగా.. ఈ సారి 7 దవల్లోనే పూర్తి చేస్తామని సీఈసీ ప్రకటించారు.