ఇంటర్ విద్యార్థిపై తోటి విద్యార్థి కాల్పులు గురుగ్రామ్ కలకలం రేపుతోంది..శనివారం(నవంబర్8) రాత్రి ఇంటికి పిలిచి మరీ ఫ్రెండ్‌పై కాల్పులు జరిపాడు11 స్టాండర్డ్ స్టూడెంట్. రెండు నెలల క్రితం ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదమే కాల్పులుకు కారణంగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
రెండు నెలల క్రితం జరిగిన గొడవే.. విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ సెక్టార్ 48లోని సెంట్రల్ పార్క్ రిసార్ట్స్‌లో ఈ సంఘటన జరిగింది. తండ్రి లైసెన్సడ్ పిస్టల్ తో క్లాస్ మేట్‌పై విద్యార్థి కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తు లో తేలింది.
సెక్టార్ 48లోని సెంట్రల్ పార్క్ రిసార్ట్స్‌లో అద్దెకు ఉంటున్న నివాసంలో నిందితులలో ఒకరైన విద్యార్థి 17 ఏళ్ల బాధితుడిని అపార్ట్‌మెంట్‌కు పిలిచి కాల్పులు జరిపాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
