90%  అంగన్‌వాడీ సెంటర్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాం : మంత్రి సీతక్క

90%  అంగన్‌వాడీ సెంటర్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాం : మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 90 శాతం అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని మంత్రి సీతక్క తెలిపారు. మొత్తం 35,781 కేంద్రాలకుగానూ 32,109 సెంటర్లలో  కరెంటు అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. మిగిలిన కేంద్రాలకు కూడా త్వరలోనే కనెక్షన్లు ఇస్తామని తెలిపారు.

గత ఆరు నెలల్లోనే యుద్ధప్రాతిపదికన 9,800 సెంటర్లకు కొత్త కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఫ్యాన్లు, లైట్లు లేకపోవడం వల్ల చిన్నారుల డిజిటల్ బోధనకు ఇబ్బందులు కలిగాయని.. ఈ సమస్యను గుర్తించి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పరిష్కరించిందని చెప్పారు. విద్యుత్, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారుల సమన్వయంతో కొత్త కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేశామని వివరించారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, ప్రస్తుత ప్రభుత్వం చేతల్లో చూపిస్తోందని వ్యాఖ్యానించారు.