9/11 అటాక్: రహస్య పత్రాలు విడుదల చేసిన FBI 

9/11 అటాక్: రహస్య పత్రాలు విడుదల చేసిన FBI 
  • హైజాకర్లతో సౌదీ అరేబియా అధికారుల లింకు..?

న్యూయార్క్: 9/11 వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడులకు సంబంధించిన రహస్య పత్రాలను ఎఫ్ బి ఐ (FBI) విడుదల చేసింది. ఆనాటి దాడులకు పాల్పడిన హైజాకర్లతో సౌదీ అధికారులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు రేకెత్తించే పత్రాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తమ ఆప్తులను కోల్పోయినవారి.. ఈ రహస్య పత్రాలను విడుదల చేయాలని అమెరికన్లు కొన్నేళ్ళుగా డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు ఎంత ఒత్తిడి తెచ్చినా నాటి అధ్యక్షులు ఒబామా, ట్రంప్‌ ప్రభుత్వాలు నిరాకరించాయి.
రహస్య పత్రాలు బయటపెడతానని ఎన్నికల ముందు జో బైడెన్ హామీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో అమెరికా ఇవాళ రహస్య పత్రాలు విడుదల చేసింది. అమెరికా-సౌదీ మధ్య సంబంధాలు దెబ్బతింటాయని గతంలో పనిచేసిన అధ్యక్షులు రహస్య పత్రాల విడుదలకు అంగీకరించలేదు. అయితే ఇవాళ బైడెన్‌ ప్రభుత్వం ఆ పత్రాల్లో కొన్ని పత్రాలు మాత్రమే విడుదల చేశారని తెలుస్తోంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడికి ఉపయోగించిన విమానాల హైజాకింగ్‌ ఘటనతో సౌదీకి సంబంధం ఉందనే కచ్చిత ఆధారాలు మాత్రం లభించలేదు. అనుమానిత పత్రాలు లభించినట్లు విశ్లేషిస్తున్నా..  సౌదీని దోషిగా నిలబెట్టాలంటే మరింతగా బలమైన ఆధారాలు అవసరమని న్యాయ నిపుణులు అభిప్రాయతున్నారు.