
హైదరాబాద్, వెలుగు: ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీఈసెట్ ) ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 96.50% మంది క్వాలిఫై అయ్యారు. శనివారం ఉన్నత విద్యామండలి ఆఫీసులో కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వీ వెంకటరమణ, శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ మల్లేశంతో కలిసి ఫలితాలు రిలీజ్ చేశారు.
ఈ పరీక్షకు 2,865 మంది దరఖాస్తు చేసుకోగా 1,769 మంది అటెండ్ అయ్యారు. వీరిలో 1,707 మంది అర్హత సాధించారు. బీపీఈడీకి 1,852 మంది అప్లై చేసుకోగా, 1,193 మంది ఫిజికల్ టెస్టులకు అటెండ్ అయ్యారు. వీరిలో1,153 మంది అర్హత సాధించినట్టు అధికారులు తెలిపారు.