హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన నేషనల్ మీన్స్ -కమ్- మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) స్కీమ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. స్టేట్లో 173 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఎగ్జామ్ కు 96% మంది అటెండ్ అయినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.
ఈ స్కాలర్‌షిప్ పరీక్ష కోసం మొత్తం 35,960 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. వారిలో 34,665 మంది పరీక్షకు హాజరయ్యారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను నిర్వహిస్తున్నది.
