
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ సమయంలో చనిపోయిన వలస కూలీల మృతికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్యసభలో కాస్త దుమారం రేగింది. దీంతో తాజాగా మైగ్రంట్ వర్కర్స్ మరణాలకు సంబంధించిన డేటాను సర్కార్ వెల్లడించింది. లాక్‌డౌన్ మొదలైన టైమ్ నుంచి సెప్టెంబర్ 9వ తేదీన శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ బయల్దేరేంత వరకు 97 మంది మైగ్రంట్ వర్కర్స్ చనిపోయారని స్పష్టం చేసింది. మేలో శ్రామిక్ ట్రెయిన్స్‌లో ప్రయాణించిన వారిలో 80 మంది వలస కూలీలు మృతి చెందారని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పేర్కొంది. ‘చనిపోయిన 97 మంది మైగ్రంట్ వర్కర్స్‌లో 87 కేసుల్లో స్టేట్ పోలీసులు డెత్ బాడీలను పోస్ట్ మార్టంకు పంపారు. వీటిల్లో 51 పోస్ట్ మార్టం రిపోర్టులను స్టేట్ పోలీసుల నుంచి అందుకున్నాం. ఇందులో చాలా మంది చావులకు హార్ట్ ఎటాక్, బ్రెయిన్ హెమోర్హేజ్, క్రోనిక్ లంగ్ డిసీజ్, క్రోనిక్ లివర్ డిసీజ్ లాంటివి కారణం అని తెలిసింది’ అని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.