సెకనులో హయ్యెస్ట్ స్పీడ్ అందుకున్న 5G

సెకనులో హయ్యెస్ట్ స్పీడ్ అందుకున్న 5G
  • ఒక సెకనుకు 9.85 జీబీపీస్‌‌‌‌ స్పీడ్‌‌
  • 5జీ ట్రయల్స్‌‌లో సాధించిన నోకియా, వీఐ

న్యూఢిల్లీ:  నోకియాతో కలసి బుధవారం నిర్వహించిన 5జీ ట్రయల్స్‌‌లో సెకనుకు 9.85 జీబీల స్పీడుతో నెట్‌‌వేగాన్ని సాధించామని టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా (వీ) ప్రకటించింది.  గుజరాత్‌‌లోని గాంధీనగర్‌‌లో మొబైల్ బేస్ స్టేషన్ల నెట్‌‌వర్క్‌‌ను కనెక్ట్ చేయడం ద్వారా ఈ ట్రయల్స్‌‌ జరిపామని వెల్లడించింది. డాట్‌‌ కేటాయించిన 80 హెజ్‌‌ స్పెక్ట్రమ్‌‌లో ‘ఈ’ బ్యాండ్ మైక్రోవేవ్‌‌ను ఉపయోగించి 9.85 జీబీపీఎస్ బ్యాక్‌‌హాల్ కెపాసిటీని సాధించామని  నోకియా ఇండియా ట్వీట్‌‌ చేసింది.  ఈ ఏడాది సెప్టెంబరులో పుణేలో జరిగిన 5జీ ట్రయల్స్‌‌లో 3.7 జీబీపీఎస్ వేగాన్ని రికార్డు చేసినట్టు వీఐ పేర్కొంది. మిడ్-బ్యాండ్ స్పెక్ట్రమ్‌‌లో 1.5 జీబీపీఎస్ డౌన్‌‌లోడ్ స్పీడ్‌‌ వచ్చిందని పేర్కొంది. ఇదే ఏడాదిజూన్‌‌లో జియో, జూలైలో ఎయిర్‌‌టెల్‌‌ కూడా 5జీ ట్రయల్స్‌‌ జరిపాయి. ఎయిర్‌‌టెల్‌‌ హైదరాబాద్‌‌లోనూ 5జీ నెట్‌‌వర్క్‌‌ను టెస్ట్‌‌ చేసింది.