పేరంట్స్ షాక్ : 13 ఏళ్ల పిల్లోడు.. స్కూల్ లో PT చేస్తూ చనిపోయాడు

పేరంట్స్ షాక్ : 13 ఏళ్ల పిల్లోడు.. స్కూల్ లో PT చేస్తూ చనిపోయాడు

ముంబయిలోని ఓ స్కూల్లో పీటీ చేస్తూ 13 ఏళ్ల బాలుడు ఉన్నట్టుండి చనిపోయాడు. ఇదే ఇప్పుడు మిస్టరీగా మారింది. బాలుడి మరణానికి అసలు కారణం ఏంటనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

కండివ్లి పోలీస్ ఇన్‌స్పెక్టర్ సందీప్ విశ్వాసరావు చెప్పిన వివరాల ప్రకారం.. 

ముంబయి కండివ్లీలోని శ్రీ ఆర్జే మఖేజా హైస్కూల్‌లోని హలై బాలాశ్రమ్ హాస్టల్‌లో ఓం సచిన్ గండేచా అనే 13 ఏళ్ల బాలుడు ఉంటున్నాడు. వీళ్ల సొంతూరు గుజరాత్‌. శ్రీ ఆర్జే మఖేజా హైస్కూల్‌లో గండెచా 8వ తరగతి చదువుతున్నాడు. పీటీ ఉపాధ్యాయుడు సంతోష్ శర్మ స్కూలు ఆవరణలో గేమ్స్​ ఆడిపిస్తున్నాడు. గండేచా పీటీ విధులు నిర్వర్తిస్తూ.. ఉన్నట్టుండి కింద కుప్పకూలిపోయాడు.

ALSO READ: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

అక్కడున్న తోటి విద్యార్థులతో పాటు పీటీ ఉపాధ్యాయుడు వెంటనే అలర్ట్ అయ్యారు. స్కూలు ఆవరణలోనే ఉన్న చెట్టు కిందకు గండేచాను తీసుకెళ్లారు. అతడికి తాగేందుకు నీళ్లు ఇచ్చి.. బతికేందుకు ప్రయత్నించారు. కానీ.. గండేచా గుండె స్పందించలేదు. వెంటనే దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. ఈ సంఘటన అక్టోబర్ 9వ తేదీ సోమవారం జరిగింది. 

ఈ ఘటనపై కండివ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. గండేచా 10 రోజుల క్రితం డెంగ్యూ సోకిందని, ఆ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాతే స్కూలు వచ్చాడని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెప్పారు. 

విషయం తెలియగానే గండేచా బాలుడి తల్లిదండ్రులు గుజరాత్ నుంచి వచ్చారు. పోస్టుమార్టం చేసిన తర్వాత తల్లిదండ్రులకు బాలుడి మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు చెప్పారు. అయితే... గండేచా మృతికి అసలు కారణం ఏంటో తెలుసుకుంటున్నామని చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఏం జరిగిందన్నది తెలుస్తుందన్నారు.