పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి 17 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి 17 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

జార్ఖండ్‌లో దారుణం జరిగింది. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి బయటకెళ్లిన 17 ఏళ్ల యువతిని..  అయిదుగురు యువకులు బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జంషెడ్‌పూర్‌లోని బాగ్‌బెరా ప్రాంతానికి చెందిన ఒక యువతి.. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మంగళవారం రాత్రి బయటకెళ్లింది. వీరిని గమనించిన అయిదుగురు యువకులు.. గన్ పెట్టి బెదిరించి వారిని కాల్‌యాదిహ్ గౌషాలా ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడికెళ్లిన తర్వాత యువతి బాయ్‌ఫ్రెండ్‌ను కట్టేసి కొట్టారు. ఆ తర్వాత గన్‌తో బెదిరించి యువకులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న యువతి, ఆమె ఫ్రెండ్ ఇంటికి చేరుకున్నారు.

తనపై జరిగిన అఘాయిత్యాన్ని యువతి తన కుటుంబసభ్యులకు తెలియజేసింది. తాను డ్యాన్స్ క్లాస్ నుంచి వస్తున్నప్పుడు.. అయిదుగురు యువకులు తనను గన్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. వెంటనే యువతి కుటుంబసభ్యులు జంషెడ్‌పూర్‌ ఎస్పీకి ఫిర్యాదుచేశారు. యువతి ఫిర్యాదు మేరకు.. పోలీసులు అయిదుగురు యువకులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోంకి తరలించారు. మిగతావారిని రిమాండ్‌కి పంపించారు. అరెస్టయిన వారిలో శంకర్ టియు, రోషన్ కుజుర్, సూరజ్ పాత్రో, సన్నీ సోరెన్ ఉన్నారు.

‘ఈ సంఘటన మా దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్యాన్స్ క్లాస్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు తనను అపహరించి, అత్యాచారం చేసినట్లు బాలిక చెప్పింది. అయితే, పోలీసుల దర్యాప్తులో అది తప్పు అని తేలింది. నలుగురిని అరెస్టు చేశాం.. ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోంకి తరలించాం. నిందితుల నుంచి దేశంలో తయారు చేసిన పిస్టల్‌, రెండు లైవ్‌ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నాం’ అని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ తమిళ వనన్ తెలిపారు.

For More News..

రాజేంద్రనగర్‌లో తప్పించుకున్న చిరుత బోనుల పడ్డది

తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు

డీజీపీకి రాని ఎమ్మెల్యే సీటు కానిస్టేబుల్‌కు వచ్చింది