మేడ్చల్ మల్కాజ్ గిరి: వీధి కుక్క దాడిలో గాయపడిన ఓ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. శామీర్పేట మండల కేంద్రంలోని పెద్దమ్మ కాలనీకి చెందిన బాలు, రామేశ్వరి దంపతుల పెద్ద కుమారుడు ప్రవీణ్(11). ఇంటి ముందు ఉండగా ఈనెల 18వ తేదీన వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన ప్రవీణ్ ని నగరంలోని కోరంటి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈరోజు మృతి చెందాడు.
