- ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నర్సింహరెడ్డి
గోదావరిఖని, వెలుగు: కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో త్వరలో కోల్ బ్లాక్ల వేలం జరగనుండగా సింగరేణి పాల్గొని, మణుగూరు పీకే ఓసీపీ ఎక్స్టెన్షన్బ్లాక్ను పొందాలని ఐఎన్ టీయూసీ సెంట్రల్సీనియర్వైస్ ప్రెసిడెంట్ఎస్.నర్సింహరెడ్డి కోరారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పీకే ఓసీపీ డిప్సైడ్ఎక్స్టెన్షన్ బ్లాక్‌ను సింగరేణి సంస్థ దక్కించుకుంటే మరో 20 ఏండ్ల పాటు 60 మిలియన్‌టన్నుల బొగ్గు వెలికితీసే చాన్స్ ఉందని పేర్కొన్నారు. తద్వారా మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి కొనసాగడంతో పాటు కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతాయని స్పష్టం చేశారు.
ప్రైవేటు కార్పొరేట్సంస్థలు బ్లాక్‌ను పొందడానికి అప్లికేషన్లు తీసుకున్నాయని, ఆ బ్లాక్ ను నడిపించడం వాటికి సాధ్యం కాదన్నారు. మట్టి డంప్కోసం అవసరమైన ప్రైవేటు భూమి అందుబాటులో లేదన్నారు.
కోల్‌బ్లాక్‌ను సింగరేణి సంస్థకే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటు, కార్పొరేట్‌సంస్థ వేలంలో పాల్గొంటే అన్ని సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కార్మికుల సమస్యలపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. ఆర్జీ –1 ఏరియా వైస్‌ప్రెసిడెంట్ కె.సదానందం, లీడర్లు ఆరేపల్లి శ్రీనివాస్, గడ్డం కృష్ణ, సత్యనారాయణరెడ్డి, గంగాధర్, లలితాశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
అదానీ, మెగా కంపెనీలకు ఇస్తే అడుగుపెట్టనివ్వం
ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య
గోదావరిఖని: కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేలంలో మణుగూరులోని పీకే ఓసీపీ ఎక్స్టెన్షన్ప్రాజెక్ట్ను సింగరేణికే అప్పగించాలని సంస్థ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రెసిడెంట్‌వి.సీతారామయ్య డిమాండ్ చేశారు. అదానీ, మెగా కంపెనీ వంటి కార్పొరేట్‌సంస్థలకు అప్పగిస్తే అన్ని సంఘాలతో కలిసి ఉద్యమించి అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు.
మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మణుగూరు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ సమావేశంలో లీడర్లు మడ్డి ఎల్లయ్య గౌడ్, దాసరి శ్రీనివాస్, గౌతమ్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
