సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి చంద్రశేఖర్ ఫైర్

సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి చంద్రశేఖర్ ఫైర్

హైదరాబాద్, వెలుగు : ఉచిత ఎరువులు ఇవ్వ డానికే పుట్టానని చెప్పుకున్న కేసీఆర్.. ఆ హామీ అమలు చేయకుండా రైతులను మోసం చేశాడని మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టులో వచ్చిన కమీషన్ డబ్బులు కేసీఆర్ ఎక్కడ దాచిపెట్టారో కేంద్రం వద్ద సమాచారం ఉందన్నారు.

వికారాబాద్ ప్రాంతానికి ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదని, ఏపీ సీఎం జగన్ నీళ్లు తరలించుకుపోతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. జనగామలో బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడాన్ని విఠల్ ఖండించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గూండాలు, రౌడీల్లా తయారయ్యారని, ఫ్లెక్సీలు తీసివేయాలని వారే స్వయంగా చెబుతున్నారన్నారు.